కలం, వెబ్ డెస్క్: హర్యానాలోని రోహ్తక్ జిల్లాలో జరిగిన గ్యాంగ్ వార్ (Haryana Gang War) కాల్పుల్లో నలుగురు యువకులు మృతిచెందారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. ఖరావడ్ గ్రామ సమీపంలోని ఢిల్లీ రోడ్డుపై ఉన్న మిలన్ దాబా వద్ద ముగ్గురు యువకులు భోజనం చేస్తున్నారు. ఈ సమయంలో పలు వాహనాల్లో వచ్చిన దుండగులు విచక్షణారహింతంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ముగ్గురు యువకులు భోజనం చేస్తున్న టేబుల్ వద్దే మృతిచెందగా.. ప్రాణభయంతో పరుగులు తీసిన నాలుగో యువకుడిని దుండగులు వెంబడించి కాల్చి చంపారు. గురువారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని సమీక్షించారు. మరణించిన వారిని ఝజ్జర్ జిల్లా డీఘట్ గ్రామానికి చెందిన రింకూ, వినీత్, హర్ష్ అలియాస్ గంజుగా, అలాగే బేరీ ప్రాంతానికి చెందిన హిమాన్షుగా పోలీసులు గుర్తించారు. వీరిలో ముగ్గురు సన్నీ రిటోలియా గ్యాంగ్ తో సంబంధం ఉన్నవారని, నాలుగో వ్యక్తి పొరపాటున కాల్పులకు బలయ్యాడని ప్రాథమిక విచారణలో వెల్లడైనట్లు తెలిపారు.

