హాస్టల్‌లో విద్యార్థిని ప్రసవం.. శిశువు మృతి

కలం, మహబూబాబాద్: మహబూబాబాద్ (Mahabubabad) జిల్లా కేంద్రంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఒక ప్రభుత్వ సంక్షేమ డిగ్రీ కళాశాల హాస్టల్‌లో విద్యార్థిని హాస్టల్‌లోనే ప్రసవించడం, జన్మించిన శిశువు మృతి చెందడం కలకలం రేపింది. ప్రసవం అనంతరం కళాశాల సిబ్బంది విద్యార్థినిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. విద్యార్థిని గర్భం దాల్చి, ప్రసవం జరిగే వరకు కళాశాల యాజమాన్యం ఏం చేస్తోందని ప్రశ్నించాయి. హాస్టల్‌లో సరైన పర్యవేక్షణ లేకపోవడం వలనే ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయని ఆరోపించాయి. సమగ్ర విచారణ జరిపి, నిర్లక్ష్యానికి బాధ్యులైన కళాశాల ప్రిన్సిపల్‌, ఇతరులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>