మడుపల్లి పాఠశాలలో మంచినీటి కరువు.. మున్సిపాలిటీ నిద్రమత్తు!

కలం, మధిర : ఖమ్మం జిల్లా ​మధిర మున్సిపాలిటీ పరిధిలోని మడుపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో (Madupalli Government School) మంచినీటి కరువు రాజ్యమేలుతోంది. కనీస తాగునీటి సదుపాయం కల్పించడంలో మున్సిపాలిటీ అధికారులు పూర్తిగా నిద్రమత్తులో ఉన్నారంటూ విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలలో చదువుకుంటున్న 30 మంది విద్యార్థిని, విద్యార్థులు గుక్కెడు మంచినీటి కోసం తీవ్ర అవస్థలు పడుతున్నారు.

పాఠశాలలో ఉన్న వాటర్ ట్యాంకులను శుభ్రం చేయకపోవడంతో అవి అపరిశుభ్రంగా మారి, తాగునీటి సరఫరా నిలిచిపోయింది. ట్యాంకులను శుభ్రం చేసి, మంచినీటి సౌకర్యం కల్పించాలని మున్సిపాలిటీ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా వారు కనీసం పట్టించుకోవడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ​

దీంతో పాఠశాలలో మంచినీరు లేక చిన్నారులు దాహం వేసిన ప్రతిసారీ పక్కనే ఉన్న రామాలయం వాటర్ ట్యాంక్ వద్దకు వెళ్లి నీళ్లు తాగాల్సిన దుస్థితి ఏర్పడింది. విద్యాబుద్ధులు నేర్పే బడిలోనే కనీస మౌలిక వసతి లేకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని గ్రామస్తులు మండిపడుతున్నారు. మున్సిపాలిటీ అధికారులు ఇప్పటికైనా నిద్రమత్తు వీడి, తక్షణమే స్పందించి పాఠశాలలోని వాటర్ ట్యాంకులను శుభ్రపరిచి, విద్యార్థులకు స్వచ్ఛమైన మంచినీటిని అందించాలని తల్లిదండ్రులు, స్థానికులు కోరుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>