కలం, కరీంనగర్: ముంబై వేదికగా వరల్డ్ మేయర్స్ సదస్సులో కొలగాని శ్రీనివాస్(Kolagani Srinivas)కు అరుదైన గౌరవం దక్కింది. ఈ సదస్సులో భాగంగా ముంబై నగర మేయర్‌తో కలిసి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌కు ఆయన సాదర స్వాగతం పలికారు. దేశ విదేశాల నుంచి పలు ముఖ్యమైన నగరాల మేయర్లు, ప్రజాప్రతినిధులు హాజరైన ఈ వేదికపై కొలగాని శ్రీనివాస్‌కు ఈ ప్రత్యేక గౌరవం లభించడం విశేషం.
ఈ సదస్సులో పట్టణాభివృద్ధి(అర్బన్ డెవలప్‌మెంట్) అంశంపై విస్తృత స్థాయిలో చర్చలు జరిగాయి. ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు చెందిన అర్బన్ డెవలప్‌మెంట్ మంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొని, భవిష్యత్ నగరాల నిర్మాణం, మౌలిక సదుపాయాల కల్పన పట్టణ ప్రాంతాల ఆధునీకరణపై తమ అభిప్రాయాలను పంచుకుంటూ దిశానిర్దేశం చేశారు. జాతీయ స్థాయి వేదికపై తెలంగాణ తరపున ప్రాతినిధ్యం వహిస్తూ, ముఖ్యమంత్రి స్థాయి నేతకు స్వాగతం పలికే అవకాశం రావడం పట్ల కొలగాని శ్రీనివాస్ సంతోషాన్ని వ్యక్తం చేశారు.

