నా జీవితాన్ని మార్చేసిన సలహా ఇదే: సీఎం సువేందు

కలం, వెబ్ డెస్క్: దివంగత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ (Pranab Mukherjee) ఇచ్చిన ఒక్క సలహా తన రాజకీయ జీవితాన్ని పూర్తిగా మార్చేసిందని బెంగాల్ సీఎం సువేందు అధికారి (Suvendu Adhikari) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “ప్రణబ్ ముఖర్జీని నా రాజకీయ సలహాదారుడిగా భావిస్తుంటా. ఆయన రాష్ట్రపతి అయ్యాక కలిసేందుకు రాష్ట్రపతి భవన్‌కి వెళ్లా. అప్పుడు ప్రణబ్ ఒక్క మాట చాలా సూటిగా చెప్పారు. నువ్వేం చేయాలనుకుంటున్నావో ఆలోచించు. ఒక ఉద్యోగిగా ఉండాలనుకుంటే ఆమె (మమతా బెనర్జీ)తో ఉండు. నీ శక్తి సామర్థ్యాల మీద నమ్మకం ఉండి జీవితంలో ముందుకు వెళ్లాలనుకుంటే మోదీతో కలిసి నడువు అని చెప్పారు. ఇది చెప్పినందుకు ఇప్పుడు ప్రణబ్‌ని కూడా విమర్శిస్తారు. కానీ ఆయన నాకు రక్షకుడు, మార్గనిర్దేశకుడు. రాజకీయాలకు అతీతంగా ప్రణబ్ ముఖర్జీని ప్రతి భారతీయుడు ఎంతో గౌరవిస్తారు” అని సువేందు చెప్పారు.

తృణమూల్ పార్టీ కాదు.. కంపెనీ

తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కాదని, కంపెనీ అని సీఎం సువేందు అధికారి (Suvendu Adhikari) తీవ్ర విమర్శలు గుప్పించారు. పార్టీ అంతా ఆమె, అల్లుడి పేరు మీదనే నడుస్తుంటుందని.. ఆ కంపెనీకి ఆమె ఛైర్మన్, ఎండీ కూడా అని ఎద్దేవా చేశారు. ప్రణబ్ సలహాతో 2020లో బీజేపీలో చేరిన సువేందు అధికారి.. 15 ఏళ్ల మమతా బెనర్జీ పాలనకు ముగింపు పలికడంలో విజయవంతం అయ్యారు. 294 సీట్లలో 208 సీట్లలో బీజేపీ గెలుపొందింది. మమతా బెనర్జీ మీద భవానీపూర్ లో పోటీ చేసిన సువేందు అధికారి ఆమెను ఓడించి ముఖ్యమంత్రి అయ్యారు.

Also Read : ఫ్లిప్‌కార్ట్ సీఈఓ కల్యాణ్ కృష్ణమూర్తి రాజీనామా.. 11 ఏళ్ల ప్రస్థానానికి ముగింపు

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>