బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శిగా రతన్ కుమార్

కలం, కరీంనగర్: భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శిగా కొత్తపల్లి మండలం, ఎలగందుల గ్రామానికి చెందిన కడార్ల రతన్ కుమార్(Rathan Kumar) నియమితులయ్యారు. ఈ మేరకు ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు ఆకుల రాజేందర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా రతన్ కుమార్ మాట్లాడుతూ.. జిల్లాలో ఓబీసీ మోర్చా బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు.

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ సహాయ సహకారాలతో జిల్లాలోని బీసీలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాడుతానని పేర్కొన్నారు. తన నియామకానికి సహకరించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్, బీజేపీ జిల్లా అధ్యక్షులు సాయిని మల్లేశం, కరీంనగర్ పార్లమెంట్ కన్వీనర్ బోయిన్పల్లి ప్రవీణ్ రావు, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు ఆకుల రాజేందర్‌తో పాటు జిల్లా పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>