కమిన్స్ మాటలు బాధించాయి.. ఖ్వాజా ఆవేదన!

కలం, స్పోర్ట్స్: 2018 బాల్ ట్యాంపరింగ్ వివాదం ఆస్ట్రేలియా క్రికెట్‌లో మరోసారి చర్చకు వచ్చింది. ఈ ఘటనపై తన పుస్తకంలో సంచలన విషయాలు వెల్లడించిన ఉస్మాన్ ఖ్వాజా (Usman Khawaja).. పాట్ కమ్మిన్స్ స్పందనపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. కమిన్స్ తనపై వ్యక్తిగతంగా విమర్శలు చేయడం బాధించిందని తెలిపాడు. అయితే, అతడి కెప్టెన్సీ పోవాలని తాను ఎప్పుడూ కోరుకోలేదని స్పష్టం చేశాడు. దక్షిణాఫ్రికాలో జరిగిన బాల్ ట్యాంపరింగ్ ఘటనలో అప్పటి కెప్టెన్ స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్, కామెరాన్ బాన్‌క్రాఫ్ట్ మాత్రమే బాధ్యులుగా తేలారు. కానీ, జట్టులో అందరికీ ఈ విషయం తెలుసని ఖ్వాజా తన పుస్తకంలో పేర్కొన్నాడు.

దీనిపై కమిన్స్ తీవ్రంగా స్పందించాడు. ఖ్వాజా వ్యాఖ్యలను తప్పుబట్టడంతో పాటు, అవి నిరాధారమైనవని అన్నాడు. కమిన్స్ ప్రెస్ కాన్ఫరెన్స్ తనను ఆశ్చర్యపరిచిందని ఖ్వాజా తెలిపాడు. వ్యాఖ్యలను విమర్శించడం వేరు కానీ, వ్యక్తిగతంగా దాడి చేయడం బాధించిందని పేర్కొన్నాడు. ప్రెస్ కాన్ఫరెన్స్‌కు ముందే కమిన్స్‌ను సంప్రదించి, ఇద్దరి మధ్య రాజీ కుదిరేలా ప్రయత్నించినట్లు వెల్లడించాడు. ఈ వివాదానికి ముగింపు పలికేందుకు క్రికెట్ ఆస్ట్రేలియాతోనూ ఖ్వాజా మాట్లాడాడు.

బాల్ ట్యాంపరింగ్ విషయంలో జట్టు మొత్తం సమిష్టి బాధ్యత తీసుకుంటూ ప్రకటన చేయాలని ప్రతిపాదించాడు. బాల్‌ను కృత్రిమంగా మార్చే ప్రయత్నం గురించి జట్టుకు తెలుసని అంగీకరించాలని సూచించాడు. అయితే, శాండ్‌పేపర్‌నే ఉపయోగించారా లేదా అన్నది ప్రస్తావించాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డాడు. ఈ ప్రతిపాదనపై క్రికెట్ ఆస్ట్రేలియా సీఈఓ టాడ్ గ్రీన్‌బర్గ్ సందేహం వ్యక్తం చేసినట్లు ఖవాజా తెలిపాడు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>