వ్యవసాయ కార్మికుల హక్కుల సాధనకు ఉద్యమించాలి: పంజాల శ్రీనివాస్

కలం, కరీంనగర్: వ్యవసాయ కార్మికుల సమస్యల పరిష్కారం, హక్కుల సాధన, సమగ్ర వ్యవసాయ కార్మిక చట్టం కోసం ఐక్యంగా ఉద్యమించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్(Panjala Srinivas) పిలుపునిచ్చారు. బుధవారం స్థానిక బద్దం ఎల్లారెడ్డి భవన్‌లో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం జిల్లా అధ్యక్షుడు బోయిని అశోక్ అధ్యక్షతన జరిగింది.

ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన శ్రీనివాస్ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ కూలీలకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో పోరాడి సాధించుకున్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం నిర్వీర్యం చేసేందుకు కుట్రలు చేస్తోందని విమర్శించారు. పథకం పేరును వీబీ-జీ రామ్ జీగా మార్చడంతో పాటు బడ్జెట్ కేటాయింపులు తగ్గించడం వల్ల పేద కూలీల ఉపాధి హక్కులకు భంగం కలుగుతోందన్నారు.

వీబీ-జీ రామ్ జీ పథకాన్ని రద్దు చేసి పాత ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. వ్యవసాయ కూలీలకు ఏడాదికి 200 రోజుల పని కల్పించాలని, రోజువారీ వేతనం రూ.800 ఇవ్వాలని కోరారు. 55 ఏళ్లు నిండిన కార్మికులకు నెలకు రూ.5 వేల పింఛన్, ప్రతి కూలీకి బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. కార్మికుల హక్కుల కోసం సంఘటిత పోరాటాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు.

ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కొయ్యడ సృజన్ కుమార్, జిల్లా ఉపాధ్యక్షులు దరిపెల్లి అంకుస్, బత్తుల బాబు, అంజయ్య కార్యదర్శులు అందె స్వామి, ఎగుర్ల మల్లేశం, రాజయ్య కొమురయ్య, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>