ఏసీబీని కుదిపేస్తున్న లంచం కేసు.. సీఐ సస్పెన్షన్!

కలం, వెబ్ డెస్క్: తెలంగాణ ఏసీబీ (Telangana ACB)లో ఒక లంచం కేసు కుదిపేస్తోంది. అవినీతి కేసులో అరెస్టయిన విద్యుత్తు శాఖ మాజీ ఏడీఈ అంబేడ్కర్ సంచలన ఆరోపణలు చేశారు. తనను కేసు నుంచి తప్పించేందుకు దర్యాప్తు చేస్తున్న అధికారి రూ.30 లక్షలు లంచం డిమాండ్ చేశారని ఏసీబీ డీజీకి ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించి తన వద్ద పూర్తి ఆధారాలున్నాయని లేఖ రాశారు. అడిగినంత డబ్బు ఇస్తే తన ఆస్తులను సక్రమం అంటూ కేసు క్లోజ్ చేయిస్తానని కాంట్రాక్టర్ ద్వారా బేరసారాలు చేశారని పేర్కొన్నారు.

వాస్తవానికి తనపై అక్రమ కేసు పెట్టారని.. తన ఆస్తులన్నీ చట్టబద్ధంగా సంపాదించుకున్నవే అని అందులో తెలిపారు. తనను లంచం డిమాండ్ చేసిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అంబేడ్కర్ ఆరోపణలు ఏసీబీలో కలకలం రేపగా.. అధికారులు ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు. అంతేగాకుండా ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐని సస్పెండ్ చేసి హెడ్ క్వార్టర్‌కు అటాచ్ చేశారు.

మా వాళ్లయినా వదిలిపెట్టం..

అంబేడ్కర్ ఆరోపణలపై ఏసీబీ (Telangana ACB) కీలక ప్రకటన చేసింది. ‘అవినీతిని ఎట్టి పరిస్థితుల్లో సహించబోం. చట్టానికి ఎవరూ అతీతులు కారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో మాజీ ఏడీఈ అంబేడ్కర్‌పై నిష్పక్షపాతంగా విచారణ జరుపుతున్నాం. ఇప్పటికే ఆయన్ను మూడు సార్లు విచారణకు పిలిచినా.. ఒక్కసారి కూడా హాజరు కాలేదు. అంబేడ్కర్ ఆరోపించిన అధికారిపైనా దర్యాప్తు చేస్తున్నాం. నిజమని తేలితే సదరు అధికారిపైనా కఠిన చర్యలు ఉంటాయి. అవినీతికి పాల్పడితే సొంత అధికారులు, సిబ్బందిని కూడా వదిలిపెట్టం. చట్టప్రకారం వారిపై చర్యలు తీసుకుంటాం’ అని పేర్కొంది.

Also Read : ఒకే రోడ్డుపై పెద్దపులి.. నెమలి.. అరుదైన దృశ్యం!

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>