నిజామాబాద్ పోక్సో కేసు నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష!

కలం, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ (Nizamabad) జిల్లా ఎడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో బాధితుల కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నమోదైన పోక్సో కేసు (POCSO Case) లో నిందితుడికి ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ జడ్జ్ ఫర్ పోక్సో కోర్ట్ (ఇన్‌ఛార్జ్ ఉమెన్స్ కోర్ట్), నిజామాబాద్ 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. న్యాయమూర్తి డి. దుర్గా ప్రసాద్ బహిరంగ న్యాయస్థానంలో తీర్పు వెలువరించారు.

ఎడపల్లి మండలం జాన్‌కంపేట్ కు చెందిన మాచ్కూరి నారాయణకు ఫోక్సో కేసు కింద 20 సంవత్సరాల జైలు శిక్ష రూ.20,000 జరిమానా విధించారు. మరో సెక్షన్ కింద 2 సంవత్సరాలు జైలు, రూ.5,000 జరిమానా విధించారు. బాధిత బాలికలకు DLSA ద్వారా మొత్తం రూ.16 లక్షలు పరిహారం అందించాలని న్యాయస్థానం ఆదేశించింది. సమర్థవంతమైన దర్యాప్తు, పటిష్టమైన సాక్ష్యాధారాలు, ప్రాసిక్యూషన్ సమర్థవంతమైన వాదనల వల్ల నిందితుడికి శిక్ష పడేందుకు కృషి చేసిన కోర్టు లైజాన్ అధికారి టి. గోవింద్, ఎన్. మారుతి, బి. ప్రవీణ్, ఎస్. రణధీర్, ఎడపల్లి PS సిబ్బందిని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ప్రశంసించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>