‘అదృష్టం కాయిన్’ పేరుతో రూ.5 లక్షలు టోకరా!

కలం, వెబ్ డెస్క్: విశాఖపట్నంలో రైస్ పుల్లింగ్(Rice Pulling) పేరుతో ప్రజలను మోసం చేస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ‘అదృష్టం కాయిన్’ పేరుతో ఓ వ్యక్తి నుంచి ఏకంగా రూ.5 లక్షలు వసూలు చేసి మోసానికి పాల్పడినట్లు గుర్తించారు. వివరాల్లోకి వెళ్తే.. చింతాడ రవి అనే వ్యక్తి హైదరాబాద్‌లోని చార్మినార్ ప్రాంతంలో కేవలం రూ.2 వేలకు ఓ నాణెం కొనుగోలు చేశాడు. అనంతరం ఆ నాణేనికి అయస్కాంత పూత ఉందని, దాని వద్ద బియ్యం ఉంచితే అవి ఆకర్షితమవుతాయని ప్రచారం చేస్తూ మహిమలు ఉన్న నాణెంగా నమ్మించాడు.

వ్యాపారంలో నష్టపోయి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కోనసీమకు చెందిన రమేష్‌ను లక్ష్యంగా చేసుకుని రూ.5 లక్షలు అడ్వాన్స్‌గా వసూలు చేశాడు. అయితే డబ్బులు తీసుకున్నప్పటికీ నాణెం ఇవ్వకపోవడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. ఫోన్ కాల్ డేటా ఆధారంగా దర్యాప్తు చేపట్టిన విశాఖ పోలీసులు నిందితులను పట్టుకున్నారు. ఇలాంటి నాణేలకు ఎలాంటి అతీంద్రియ శక్తులు, ప్రత్యేక మహిమలు ఉండవని పోలీసులు స్పష్టం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>