పులివెందుల ఆర్డీవోకు హైకోర్ట్‌ అరెస్ట్ వారెంట్?

క‌లం, వెబ్‌డెస్క్‌: పులివెందుల ఆర్డీవో (Pulivendula RDO) చిన్నయ్యకు ఏపీ హైకోర్టు అరెస్ట్‌ వారెంట్ జారీ చేసిన‌ట్లుగా సోష‌ల్ మీడియాలో వార్త‌లు జోరందుకున్నాయి. ఈ మేర‌కు కోర్టు ఆర్డ‌ర్ల కాపీల పేరుతో కొన్ని ప‌త్రాలు వైర‌ల్‌గా మారాయి. కోర్టు ధిక్క‌ర‌ణ కేసులో ఆయ‌న‌పై ఈ చ‌ర్య‌ల‌కు ఉప‌క్ర‌మించిన‌ట్లు స‌ద‌రు సోషల్ మీడియా క‌థ‌నాలు పేర్కొంటున్నాయి. ఏపీ హైకోర్టులో దాసరి చెన్నకేశవులు దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ కేసును నవంబర్ 12 హైకోర్టు విచార‌ణ చేప‌ట్టింది. వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందుల ఆర్డీవో, అప్పీలేట్ అథారిటీ చినయ్యపై ఈ కేసు దాఖలైంది. నవంబర్ 10న హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా, కావాలనే ఆయ‌న‌ ఉల్లంఘించారంటూ పిటిషనర్ కోర్టును ఆశ్రయించారు.

ఈ కేసు విచారణకు వచ్చిన సమయంలో ప్రతివాది తరఫున ఎవరూ హాజరుకాలేదు. నోటీసులు అందినప్పటికీ ప్రతివాది తరఫున ఎలాంటి న్యాయవాది హాజరుకాకపోవడంతో పాటు, కోర్టులో హాజరు నమోదు చేసుకునేందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ధర్మాసనం పేర్కొంది. దీంతో ప్రతివాదిపై నాన్‌ బెయిలబుల్ వారెంట్ జారీ చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను 2026 నవంబర్ 23వ తేదీకి వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే న‌వంబ‌ర్ 23న కూడా ఈ కేసు విచార‌ణ‌కు సంబంధించి ఎవ‌రూ హాజ‌రైన‌ట్లు స‌మాచారం రాలేదు. దీంతో ఆర్డీవో అరెస్ట్ కోసం వారెంట్ జారీ చేసిన‌ట్లు కొన్ని ఆర్డ‌ర్ కాపీలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారుతున్నాయి. అయితే ఈ ప్రచారంలో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది. సదరు ఆర్డర్ కాపీలు ఫేక్ అన్న అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. దీనిపై ఆర్డీవో చిన్నయ్య నుంచి స్పష్టత రావాల్సి ఉంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>