కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్ లోని హెచ్ఐసీసీ వేదికగా జరుగుతున్న 18వ పౌల్ట్రీ ఇండియా ఎక్స్ పో (Poultry India Expo) లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) పాల్గొన్నారు. పౌల్ట్రీ రంగానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అన్ని విధాలా పూర్తి సహకారం ఉంటుందని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ఫ్యూచర్ సిటీ లో పౌల్ట్రీ పరిశ్రమకు భూమిని కేటాయిస్తామని, అక్కడ ఒక మంచి కన్వెన్షన్ సెంటర్ ను నిర్మించుకోవచ్చని సీఎం సూచించారు.
పౌల్ట్రీ అంటేనే ఒక ప్రోటీన్ ఇండస్ట్రీ అని పేర్కొన్న రేవంత్ రెడ్డి(Revanth Reddy), ఎల్ నినో వంటి వాతావరణ పరిస్థితులు ఉన్నప్పటికీ దేశంలో ఆహారానికి ఎలాంటి కొరత లేకుండా చేయడంలో ఈ రంగం కీలక పాత్ర పోషిస్తోందని కొనియాడారు. ఈ పరిశ్రమ ద్వారా రైతులకు పరోక్షంగా ఎంతో సహకారం అందుతోందని, అయితే మార్కెట్ లో ధరల హెచ్చుతగ్గులు సహజమేనని ఆయన అభిప్రాయపడ్డారు.
Also Read : నషా ముక్త్ భారత్’ పాదయాత్ర షురూ.. హీరో వెంకటేష్ కీలక పిలుపు
Follow Us On : WhatsApp

