కలం, వెబ్ డెస్క్ : గత రెండు రోజులుగా అనూహ్యంగా పెరిగిన బంగారం, వెండి ధరల్లో (Gold Silver Price) నేడు భారీ తగ్గుదల కనిపించింది. అంతర్జాతీయ మార్కెట్ లో నెలకొన్న ప్రతికూల పరిస్థితుల ప్రభావంతో బంగారం, వెండి ధరలు నేడు భారీగా తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ ప్రస్తుత గణాంకాలను పరిశీలిస్తే.. 24 క్యారెట్ల 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ. 3,220 తగ్గి రూ. 1, 24, 580 వద్ద ట్రేడ్ అవుతోంది. అలాగే భరణాల తయారీలో వినియోగించే 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 2,950 తగ్గి రూ.1,14,200 పలుకుతోంది.
అటు వెండి ధరలు కూడా భారీ పతనాన్ని చవిచూశాయి. ప్రస్తుతం కిలో వెండి ధర రికార్డు స్థాయిలో ఏకంగా రూ. 10,000 తగ్గి రూ. 1,65,000 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇరు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం ఇవే ధరలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తున్న వేళ బంగారం, వెండి ధరలు (Gold Silver Price) భారీగా దిగిరావడం సామాన్య వినియోగదారులకు భారీ ఊరటనిస్తోంది. అయితే అంతర్జాతీయ మార్కెట్ ఒడిదుడుకుల నేపథ్యంలో ఈ తగ్గుదల ఎప్పటికీ ఇలాగే కొనసాగుతుందా? లేదా మళ్లీ పెరుగుతుందా? అనేది చెప్పలేని పరిస్థితి. దీంతో ధరలు తగ్గినప్పుడే ఆభరణాలు కొనుగోలు చేయడం ఉత్తమమని బులియన్ మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు.
Also Read : మహేశ్ ఒక్క కామెంట్.. చిన్నారి రీల్‌కు 26 మిలియన్ వ్యూస్!
Follow Us On: Youtube

