సిరిసిల్లలో హృదయవిదారక ఘటన.. వృద్ధ దంపతుల కన్నీటి గాథ!

​కలం, కరీంనగర్ బ్యూరో: రెక్కల కష్టం పండించి, కంటికి రెప్పలా కాపాడి, ఆస్తిపాస్తులు సమకూర్చి పెట్టిన కన్నబిడ్డలే వృద్ధాప్యంలో ఆసరా లేకుండా చేస్తే ఆ తల్లిదండ్రుల వేదన వర్ణనాతీతం. తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల (Sircilla) పట్టణంలో ఇలాంటి మానవత్వాన్ని కలచివేసే ఘటన చోటుచేసుకుంది. ఆస్తులు పంచుకున్న నలుగురు కొడుకులు, తమను పట్టించుకోకుండా గాలికి వదిలేశారంటూ గాజుల లింబాద్రి (72), రేణుక (65) దంపతులు కన్నీటిపర్యంతమయ్యారు.

​వివరాల్లోకి వెళితే.. సిరిసిల్లకు చెందిన గాజుల లింబాద్రి, రేణుక దంపతులకు ముగ్గురు కుమారులు ఉన్నారు. తమ శక్తిమేరకు కష్టపడి ఆస్తులు సంపాదించి కొడుకులకు పంచారు. అయితే ప్రస్తుతం వృద్ధాప్యంలో ఉన్న ఈ దంపతులను అనారోగ్య సమస్యలు చుట్టుముట్టాయి. భార్య రేణుక పక్షవాతంతో బాధపడుతుండగా, భర్త లింబాద్రి కాలు విరిగి మంచానికే పరిమితమయ్యారు.
​
ఇలాంటి క్లిష్ట సమయంలో అండగా నిలవాల్సిన ముగ్గురు కొడుకులు తమను పట్టించుకోవడం లేదని, పైగా కోడళ్లు దుర్భాషలాడుతున్నారని ఆ వృద్ధ దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం తిండి, మందులు కూడా సరిగ్గా అందక, మంచానికే పరిమితమైన తమ పరిస్థితి దయనీయంగా మారిందని వాపోయారు. తన నలుగురు కొడుకుల్లో ఇద్దరు ఆటో నడుపుతుండగా ఒకరు జాబ్ చేస్తున్నారని, చిన్న కొడుకే తమ ఆలనా పాలనా చూస్తున్నాడని వాపోయారు. నెలకు రూ.3,000 ఇచ్చే కొడుకు తమ ఆలనా పాలనా చూడడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ముగ్గురు కొడుకులు తల్లిదండ్రులను పట్టించుకోవడంలేదని కన్నీటి పర్యంతమయ్యాడు.

​ఈ క్రమంలో చిన్నకొడుకు రాజు సాయంతో బాధిత వృద్ధుడు లింబాద్రి అంబులెన్స్‌లో సిరిసిల్ల (Sircilla) పట్టణ పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. అంబులెన్స్‌లో పడుకుని ఉన్న వృద్ధుడి వద్దకు సీఐ శ్రీనివాస్ స్వయంగా వెళ్లి, ఆయన నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. లింబాద్రి ఇచ్చిన ఫిర్యాదును స్వీకరించిన సీఐ శ్రీనివాస్, బాధిత దంపతులకు తప్పకుండా న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. ఆస్తులు పంచుకున్న తర్వాత తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తున్న ఘటనలు సమాజంలో పెరుగుతుండటంపై స్థానికంగా పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను ఆదుకోవాల్సిన బాధ్యత పిల్లలపై ఉందని, బాధిత దంపతులకు తగిన న్యాయం జరిగేలా అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Also Read : భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. నేటి తాజా రేట్లు ఇవే!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>