సంక్రాంతికి ఊరెళ్లేవారికి అదిరిపోయే గుడ్‌న్యూస్!

కలం, వెబ్ డెస్క్: సంక్రాంతి పండుగ వస్తుందంటే చాలు, చాలామంది సొంతూళ్లకు వెళ్లేందుకు సిద్ధమవుతుంటారు. పండుగ వేళ కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపాలని భావించే ప్రయాణికులకు, పెరిగిన రద్దీ కారణంగా రైలు టికెట్లు దొరకడం పెద్ద సవాలుగా మారుతుంటుంది. అయితే, ఈ ఏడాది సంక్రాంతికి ఆంధ్రప్రదేశ్ కు ప్రయాణించే వారికి దక్షిణ మధ్య రైల్వే అదిరిపోయే శుభవార్త అందించింది. ప్రయాణికుల సౌకర్యార్థం 30 ప్రత్యేక రైళ్ల (Sankranti Special Trains) ను ప్రకటించింది. సికింద్రాబాద్, హైదరాబాద్, చర్లపల్లి స్టేషన్ల నుండి ఆంధ్రప్రదేశ్‌‌‌లోని పలు ప్రాంతాలకు ఈ ప్రత్యేక సర్వీసులు అందుబాటులో ఉండనున్నాయి.

సికింద్రాబాద్–పార్వతీపురం: ఈ ప్రత్యేక రైలు డిసెంబర్ 23వ తేదీ ఉండి జనవరి 27వ తేదీ వరకు ప్రతి బుధవారం నడుస్తుంది. ఇది చర్లపల్లి, నల్గొండ, గుంటూరు, విజయవాడ, రాజమండ్రి, విజయనగరం స్టేషన్ల మీదుగా ప్రయాణిస్తుంది.

చర్లపల్లి–నర్సాపూర్: ఈ ప్రత్యేక రైళ్లు జనవరి 10,12,17,19 తేదీల్లో నడుస్తాయి. నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, విజయవాడ, గుడివాడ, భీమవరం టౌన్ మీదుగా రాకపోకలు సాగిస్తాయి.

వీటితో పాటు చర్లపల్లి–శ్రీకాకుళం రోడ్, హైదరాబాద్–నర్సాపేర్ మధ్య కూడా ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. ప్రయాణికులు పూర్తి తేదీలు, రైళ్ల సమయాలు, హాల్టింగ్ వివరాల కోసం రైల్వే శాఖ అధికారిక ప్రకటనను లేదా ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌ను పరిశీలించాలని సూచించారు.

Also Read : పార్టీ ముసుగులో దారుణం.. యువతిపై సామూహిక అత్యాచారం!

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>