కోళ్ల వ్యాన్‌ను ఢీకొన్న కారు.. మహారాష్ట్ర దంపతులు మృతి

కలం, మెదక్ బ్యూరో : ​సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ బైపాస్ రోడ్డుపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో (Road Accident) మహారాష్ట్రకు చెందిన భార్యాభర్తలు అక్కడికక్కడే మృతి చెందారు. మహారాష్ట్రకు చెందిన శరణప్ప, సుష్మ దంపతులు తమ కుమారుడిని హైదరాబాద్ విమానాశ్రయంలో వదిలిపెట్టి కారులో తిరిగి స్వస్థలానికి బయలుదేరారు. మార్గమధ్యలో జహీరాబాద్ బైపాస్ రోడ్డు వద్దకు రాగానే, వీరు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి ముందు వెళ్తున్న కోళ్ల వ్యాన్‌ను బలంగా ఢీకొట్టింది.

​ఈ ప్రమాద తీవ్రతకు కారు ముందు భాగం నుజ్జునుజ్జయి, శరణప్ప, సుష్మ దంపతులు తీవ్ర గాయాలతో ప్రాణాలు కోల్పోయారు. కారు నడుపుతున్న డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. ​సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతులను మహారాష్ట్ర వాసులుగా గుర్తించి, వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. గాయపడిన డ్రైవర్‌ను చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>