శబరిమల యాత్రలో ఘోర విషాదం.. ఇద్దరు అయ్యప్ప భక్తులు మృతి!

కలం, వెబ్ డెస్క్: అయ్యప్ప స్వాముల శబరిమల యాత్రలో ఊహించని విషాదం చోటుచేసుకుంది. తమిళనాడులోని విల్లుపురం జిల్లా, మైలం (Mailam) వద్ద ఆంధ్రప్రదేశ్​‌కు చెందిన​ అయ్యప్ప భక్తుల వాహనం ఘోర రోడ్డు ప్రమాదానికి గురైంది. శబరిమల యాత్రకు వెళ్తున్న భక్తుల వాహనం ప్రమాదానికి గురికావడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతులు.. తిరుపతి జిల్లా వరదయ్యపాళెం మండలం పాదిరికుప్పానికి చెందిన లక్ష్మీపతి, తమిళనాడు గుమ్మడిపూడికి చెందిన ముకుందన్‌గా గుర్తించారు.

ఈ ప్రమాదంలో రవిఆచారి, కన్నయ్య, శేఖర, సూర్య, వేలాయుధం, ప్రకాష్​, రమేష్​, మునీంద్ర, దాము, యోగేష్​, చంద్రారెడ్డి గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే 108 అంబులెన్సుల ద్వారా తిండివనం, విల్లుపురం ప్రాంతాల్లోని ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించి వైద్య చికిత్స అందిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>