దేశంలో భారీగా ఫేక్ రేషన్ కార్డులు.. ఏరివేత షురూ!

కలం, వెబ్ డెస్క్: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజనలో భాగంగా భారీగా నకిలీ రేషన్ కార్డులను (Fake Ration Cards) కేంద్ర బృందాలు గుర్తించాయి. మొత్తం రేషన్ కార్డుల్లో కనీసం 13 శాతం నకిలీవి ఉన్నట్లు తేలింది. వీరిలో ప్రభుత్వ ఉద్యోగులు, వ్యాపార వేత్తలు, ఖరీదైన వాహనాలు కలిగి ఉన్నవారు, ఏసీలు వినియోగిస్తున్నవారు ఉన్నట్లు స్పష్టమవుతోంది. దీంతో, వీరి రేషన్ కార్డులను తొలగించేందుకు రంగం సిద్ధమైంది. ఒక్కొక్కరికి అయిదు కిలోలు, ఒక్కో కుటుంబానికి 35 కిలోల ఉచిత ఆహార ధాన్యాలను కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ విభాగం అందిస్తోంది.

ఇందుకు రేషన్ కార్డులను ప్రామాణికంగా తీసుకుంటోంది. ప్రస్తుతం దేశంలో సుమారు 80 కోట్ల మందికి పైగా ఈ పథకం వర్తిస్తుందని సమాచారం. రేషన్ కార్డున్నవారు దేశంలో ఎక్కడైనా సరుకులు తీసుకునే అవకాశం ఉంది. అయితే, దీనిలో భారీగా అక్రమాలు జరుగుతున్నట్లు కేంద్రం దృష్టికి రావడంతో విచారణ చేపట్టింది. ఈ క్రమంలో నకిలీ రేషన్ కార్డుల వ్యవహారం బయటపడింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>