కలం, ఖానాపూర్: హైదరాబాద్‌లోని గాంధీ భవన్లో సోమవారం డీసీసీ అధ్యక్షులతో నిర్వహించిన సమావేశంలో నూతన ఏఐసీసీ తెలంగాణ ఇన్చార్జి బి.ఎం. సందీప్‌ను నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్(Bojju Patel) మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సందీప్‌కు శాలువా కప్పి శుభాకాంక్షలు తెలియజేశారు. నూతన బాధ్యతలు చేపట్టిన ఆయనకు అభినందనలు తెలిపారు.

