ఆల‌యాల‌పై చంద్ర‌బాబు దాడులు: వైఎస్ జ‌గ‌న్

క‌లం, వెబ్‌డెస్క్‌: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ (YS Jagan) ఏపీలో ఆలయాల కూల్చివేతలపై ఎక్స్‌ వేదికగా తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అన్నమయ్య జిల్లా అంజనేయపురంలోని శతాబ్దాల చరిత్ర కలిగిన అభయ ఆంజనేయస్వామి ఆలయాన్ని బుల్డోజర్లతో కూల్చివేయడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటన కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని పేర్కొన్నారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఆలయాలపై దాడులు కొనసాగుతున్నాయని విమర్శించారు.

గతంలో తిరుమలలో చారిత్రక వేయి కాళ్ల మండపం తొలగింపు, కృష్ణా పుష్కరాల సమయంలో విజయవాడలో 40 ఆలయాల కూల్చివేత, బద్వేల్‌లోని కాశినాయన జ్యోతి క్షేత్రం వద్ద జరిగిన కూల్చివేతలను జగన్‌ తన పోస్టులో ప్రస్తావించారు. దేశవ్యాప్తంగా ఆలయాల నిర్మాణం, పునరుద్ధరణ కోసం తమ ప్రభుత్వ హయాంలో శ్రీవాణి ట్రస్టును ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించకుండా పవిత్ర కట్టడాలను కూల్చివేయడం ఏమిటని ప్రశ్నిస్తూ.. సనాతన ధర్మ పరిరక్షణ అంటే ఇదేనా అంటూ చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీశారు. హే రామ్‌.. సేవ్ టెంపుల్స్.. సేవ్ ఆంధ్ర‌ప్ర‌దేశ్ అంటూ త‌న పోస్టుల రాసుకొచ్చారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>