వాట్సాప్ వెబ్ వాడుతున్నారా.. బిగ్ అలర్ట్!

కలం, వెబ్ డెస్క్: వాట్సాప్ వెబ్ (WhatsApp Web) వాడేవారికి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వార్నింగ్ ఇచ్చింది. సైబర్ నేరగాళ్లు వాట్సాప్ వెబ్‌లోకి చొరబడి.. అవతలి వ్యక్తులతో చాట్ చేస్తూ.. మోసం చేసే ప్రమాదం ఉందని పేర్కొంది. ఇటీవల కాలంలో పెరుగుతున్న ఘటనల నేపథ్యంలో వాట్సాప్ వెబ్ వాడేవారికి హోం మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తున్న నేషనల్ సైబర్ క్రైం థ్రెట్ అనలిటిక్స్ యూనిట్ పలు రకాల సూచనలు జారీ చేసింది. అత్యంత ముఖ్యమైన పనుల కోసం వాట్సాప్ వెబ్ వాడటం మానుకోవాలని సూచించింది.

ప్రభుత్వం, ఆర్థిక, వ్యక్తిగత, ఇతర సున్నితమైన సమాచారాన్ని షేర్ చేసేందుకు వాట్సాప్ వెబ్ వాడకపోవడమే మంచిదని స్పష్టం చేసింది. ఆఫీస్ వర్క్ ముగిసిన వెంటనే వాట్సాప్ వెబ్‌ను లాగాఫ్ చేసుకోవాలని.. మరీ ముఖ్యంగా షేరింగ్ కంప్యూటర్లు వాడుతుంటే ఇది అత్యంత ముఖ్యమని పేర్కొంది. ప్రతి ఉద్యోగి వర్క్ పూర్తయిన వెంటనే కచ్చితంగా లాగాఫ్ చేసుకోవాలని.. కేవలం ట్యాబ్ లేదా విండో బ్రౌజర్ మూసివేసినంత మాత్రాన లాగాఫ్ అయినట్లు కాదని వివరించింది.

ప్రమేయం లేకుండానే జరిగిపోతే..

ఒకవేళ తాత్కాలికంగా వాట్సాప్ వెబ్ (WhatsApp Web) వాడుకోవాలనుకుంటే మాత్రం ఇన్‌కాంగ్నిటో లేదా ప్రైవేట్ బ్రౌజింగ్ మోడ్‌లో ఆపరేట్ చేసుకోవాలని నేషనల్ సైబర్ క్రైం థ్రెట్ అనలిటిక్స్ యూనిట్ స్పష్టం చేసింది. సైబర్ కేఫ్‌లు, పబ్లిక్ స్థలాలు, ప్రైవేట్ వ్యక్తుల డివైజ్‌ల్లో వాట్సాప్ వెబ్ లాగిన్ కావొద్దని హెచ్చరించింది. మీ ప్రమేయం లేకుండానే.. మెస్సేజ్‌లు సెండ్ అవుతుండటం, వస్తుంటే మాత్రం కచ్చితంగా అనుమానించాలని సూచించింది. నిరంతరం సాఫ్ట్‌వేర్ అప్డేట్స్ చేసుకుంటుండటం, అనుమానిత ఫైల్స్ డౌన్లోడ్ అవుతుండటం, ఇతర అనుమానాస్పద కంటెంట్ వస్తుంటే అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. డిజిటల్ గోప్యతను కాపాడుకోవడానికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించింది.

Also Read : కేసీఆర్‌ హ‌యాంలోనే ప‌ల్నాడు ప్రాజెక్టుకు బీజం: సీఎం రేవంత్‌

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>