గంగ స్నానానికి తరలిన భీమన్న గజాలు.. రేపే జాతర!

కలం, సోన్: సోన్ మండలం సంగంపేట్ గ్రామంలో భీమన్న దేవుని గజాల( Bhimanna Devuni Gajala) ఊరేగింపు సోమవారం భక్తిశ్రద్ధల మధ్య వైభవంగా నిర్వహించారు. పవిత్ర గంగస్నానానికి తీసుకెళ్లే ముందు గజాలను గ్రామంలోని ప్రతి ఇంటికి భాజాబజంత్రీలు, సాంప్రదాయ నృత్యాల నడుమ ఘనంగా ఊరేగించారు. గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని గజాలకు స్వాగతం పలికారు. మహిళలు గజాలకు పసుపు, కుంకుమలు సమర్పించి భక్తిపూర్వకంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా మంగళవారం భీమన్న జాతర మహోత్సవం జరుగుతుందని గ్రామస్తులు తెలిపారు. జాతరను పురస్కరించుకుని ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>