కలం, ఆదిలాబాద్: ఆదిలాబాద్‌లో ఈ నెల 28న సనాతన హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిర్వహించనున్న ‘మహాకోటి దీపోత్సవం’ ప్రచార పోస్టర్‌ను జిల్లా కలెక్టర్ రాజర్షిషా( Rajarshi Shah) సోమవారం తన క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. స్థానిక మార్వాడి ధర్మశాల, శ్రీ వేంకటేశ్వర ఆలయంలో ఈ వేడుకలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సమితి అధ్యక్షుడు ప్రమోద్ కుమార్ ఖత్రితో పాటు సభ్యులు కందుల రవీందర్, రవీందర్ రేణికుంట, సంతోష్ అగ్రవాల్, పిల్లి మహిపాల్, శశికళ, భార్గవి తదితరులు పాల్గొన్నారు.

