పశ్చిమ బెంగాల్‌కు కొత్త పేరు.. కేబినెట్ ఆమోదం!

కలం, వెబ్ డెస్క్: పశ్చిమ బెంగాల్ (West Bengal) రాష్ట్రం పేరు మారబోతుంది. ‘పశ్చిమ బంగ'(Paschim Banga)గా మారుస్తూ సీఎం సువేందు అధికారి ఆధ్వర్యంలోని రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. డిసెంబర్ 9న అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశ పెట్టనుంది. అక్కడ ఆమోదం పొందిన తరువాత కేంద్ర ప్రభుత్వానికి పంపించనుంది. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రం పేరు మార్చే ప్రక్రియను వేగవంతం చేసింది.

బెంగాల్ పేరు పెట్టబోతున్నట్లు చర్చ జరిగింది. అన్ని వర్గాల నుంచి అభిప్రాయాలు సేకరించిన రాష్ట్ర ప్రభుత్వం పశ్చిమ బంగ పేరును ఓకే చేసింది. రాజ్యాంగం ప్రకారం.. రాష్ట్రాల పేర్లు, సరిహద్దులను మార్చే అధికారం కేంద్ర ప్రభుత్వానికే ఉంటుంది. పార్లమెంటులో ఈ మేరకు సవరణ చేశాక.. రాష్ట్రపతి సంతకంతో చట్టంలో కొత్త పేరును చేరుస్తారు. ఇటీవలే కేరళ రాష్ట్ర పేరును ‘కేరళం’గా మార్చిన విషయం విదితమే.

Also Read : ప్రధాని మోదీ కీలక ప్రకటన.. నేపాల్‌కు భారీగా నిధులు

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>