మావోయిస్టుల పునరావాసం.. రూ.5.59 కోట్లు విడుదల చేసిన తెలంగాణ సర్కార్

కలం, వెబ్ డెస్క్ : తెలంగాణలో మావోయిస్టు ఉద్యమాన్ని విడిచిపెట్టి జనజీవన స్రవంతిలో కలిసిన వారికి పునరావాసం కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక చర్య చేపట్టింది. పునరావాస పథకంలో భాగంగా తాజాగా లొంగిపోయిన 214 మంది మాజీ మావోయిస్టులకు (Surrendered Maoists) రూ.5.59 కోట్ల నగదు ప్రోత్సాహకాలను విడుదల చేసింది. ఆయుధాలు విడిచిన వారికి ఆర్థిక భరోసా కల్పించి, సాధారణ జీవితం గడిపేలా ప్రోత్సహించడమే ఈ కార్యక్రమ లక్ష్యమని డీజీపీ సీవీ ఆనంద్ (DGP CV Anand) తెలిపారు.

2025 అక్టోబర్ 21న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాయుధ పోరాటానికి స్వస్తి పలికి జనజీవన స్రవంతిలోకి రావాలని ఇచ్చిన పిలుపు అనంతరం లొంగుబాట్లు పెరిగాయని డీజీపీ వెల్లడించారు. 2024 జనవరి 1 నుంచి ఇప్పటివరకు తెలంగాణలో మొత్తం 824 మంది మావోయిస్టులు లొంగిపోయినట్లు తెలిపారు. వీరిలో తెలంగాణకు చెందిన 59 మంది, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన 754 మంది, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 9 మంది, మహారాష్ట్ర, ఒడిశా నుంచి ఒక్కొక్కరు ఉన్నారు.

లొంగిపోయిన వారిలో అగ్రస్థాయి కమిటీ సభ్యుల నుంచి మిలీషియా సిబ్బంది వరకు వివిధ హోదాల్లో ఉన్నవారు ఉన్నారు. ఇప్పటివరకు 659 మంది లబ్ధిదారులకు రూ.17.68 కోట్లు పంపిణీ చేశారు. ఆధార్, బ్యాంకు వివరాలు సమర్పించాల్సిన మరో 96 మందికి కూడా త్వరలో నగదు అందించనున్నారు.

Also Read : మంత్రులపై ఆగ్రహం.. హై కమాండ్‌కు ఫిర్యాదు!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>