కిరణ్ అబ్బవరం కొత్త సినిమా ప్రకటన.. ఆసక్తికరంగా టైటిల్!

కలం, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) మరో ఆసక్తికరమైన సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. తాజాగా ఆయన నటించనున్న కొత్త సినిమాను అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రానికి ‘రికార్డ్’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేశారు. వీరా కొగటం దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. తాజాగా ఈ సినిమా షూటింగ్ పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌గా లాంఛ్ చేశారు. నిర్మాత దిల్ రాజు తొలి క్లాప్ కొట్టగా, ప్రముఖ దర్శకుడు సుకుమార్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. తొలి సన్నివేశానికి బన్నీ వాస్ దర్శకత్వం వహించారు.

ఇక తాజాగా విడుదల చేసిన టైటిల్ రివీల్ పోస్టర్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. పోస్టర్‌లో గుర్రం, కోడిపుంజు ఈకలు వంటి ఆసక్తికరమైన అంశాలు కనిపిస్తున్నాయి. వీటిని చూస్తుంటే ఈ సినిమా మిస్టరీ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని సుకుమార్ రైటింగ్స్, వంశీ నందిపాటి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై నిర్మిస్తున్నారు. కిరణ్ అబ్బవరం గత చిత్రాలకు భిన్నంగా ఈ సినిమా ఉండబోతుందనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>