షాకింగ్ న్యూస్.. మళ్లీ భగ్గుమన్న బంగారం, వెండి ధరలు!

కలం, వెబ్ డెస్క్: గత కొన్ని రోజులుగా వరుసగా దిగొస్తూ కొనుగోలుదారులకు ఊరటనిచ్చిన బంగారం, వెండి ధరలు (Gold Silver Price) నేడు అనూహ్యంగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న సానుకూల సంకేతాలు, దేశీయంగా పెళ్లిళ్ల సీజన్ డిమాండ్ తోడవడంతో పసిడి, వెండి రేట్లు ఒక్కసారిగా ఎగబాకాయి. తాజాగా 10 గ్రాముల బంగారం ధరపై ఏకంగా దాదాపు రూ. 2,000 వరకు పెరుగుదల నమోదు కాగా, కిలో వెండి ధర సుమారు రూ. 3,000 మేర పెరిగింది.

హైదరాబాద్ బులియన్ మార్కెట్ ప్రస్తుత గణాంకాలను పరిశీలిస్తే.. 24 క్యారెట్ల 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ. 1,480 పెరిగి రూ. 1,26,560కి చేరుకోంది. అలాగే ఆభరణాల తయారీలో వినియోగించే 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 1,350 పెరిగి రూ. 1,16,000 వద్ద ట్రేడవుతోంది. మరోవైపు వెండి ధరలు కూడా స్వల్పంగా పెరిగాయి. ప్రస్తుతం కిలో వెండి ధర రూ. 1, 75,000 వద్ద కొనసాగుతోంది. ఇరు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం దాదాపు ఇవే ధరలున్నాయి.

Also Read : ఫెయిర్‌నెస్ క్రీమ్‌ తో కిడ్నీ వ్యాధి.. ప్రముఖ సింగర్ ఆవేదన

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>