ఆధ్యాత్మిక కేంద్రాల అభివృద్ధికి సహకారం అవసరం: మాజీ ఎంపీ రావుల

కలం, వనపర్తి: ఖిల్లా ఘణపురం మండల కేంద్రంలోని కమ్మరి గిరి శివాలయం ఆవరణలో నూతనంగా నిర్మిస్తున్న కాళికామాత ఆలయానికి బిఆర్ఎస్ నేత మాజీ రాజ్యసభ సభ్యుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డి (Ravula Chandrasekhar Reddy) ఆదివారం ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేవాలయాలు మానసిక ప్రశాంతతకు, ఆధ్యాత్మిక చింతనకు కేంద్రాలుగా నిలుస్తాయని అన్నారు.

భక్తి, సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు ఆలయాల అభివృద్ధి ఎంతో అవసరమని పేర్కొన్నారు. ఆర్థిక సాయం అందించిన రావుల చంద్రశేఖర్‌రెడ్డికి ఆలయ కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్, అమరేందర్, ఆలయ కమిటీ సభ్యులు వడ్ల జానకిరాములు, పులేందర్ చారి, బ్రహ్మయ్య చారి, శ్రీనివాసులు చారి, శాంతకుమార్ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>