ఆరోజున అడెల్లి పోచమ్మ ఆలయంలో జంతుబలులు నిషేధం!

కలం, సారంగాపూర్ : సారంగాపూర్ మండలం అడెల్లి గ్రామంలోని శ్రీ మహా పోచమ్మ (Adelli Pochamma) ఆలయ పునఃప్రతిష్ఠాపన జరిగి ఏడాది పూర్తయిన సందర్భంగా ఈ నెల 26న గురువారం వార్షికోత్సవం నిర్వహించనున్నట్లు ఆలయ ఇన్చార్జి ఈవో భూమయ్య ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఆరోజు ఆలయ ప్రాంగణంలో జంతుబలులు నిషేధించినట్లు స్పష్టం చేశారు. మేకలు, గొర్రెలు, కోళ్లను బలి ఇవ్వడానికి అనుమతి ఉండదని పేర్కొన్నారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి ఆలయ నిబంధనలకు సహకరించాలని కోరారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>