మైనర్ల డ్రైవింగ్‌పై నిర్మల్‌ పోలీసుల ప్రత్యేక తనిఖీలు!

కలం, నిర్మల్ : జిల్లాలో మైనర్లు వాహనాలు నడపడాన్ని అరికట్టేందుకు పోలీసులు (Nirmal Police) ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. ఎస్పీ డాక్టర్ జానకి షర్మిల ఆదేశాల మేరకు ఆదివారం జిల్లా వ్యాప్తంగా ప్రధాన రహదారులు, రద్దీ ప్రాంతాల్లో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వాహనదారుల డ్రైవింగ్ లైసెన్సులు, వాహనాలకు సంబంధించిన పత్రాలను పరిశీలించారు. మైనర్లు వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రమాదం ఉందని పోలీసులు హెచ్చరించారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు వాహనాలు ఇవ్వకుండా బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. నిబంధనలను ఉల్లంఘిస్తూ మైనర్లకు వాహనాలు ఇచ్చే తల్లిదండ్రులు, వాహన యజమానులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>