బీజేపీ మహా పాదయాత్రకు సునీల్ రావు పిలుపు

కలం, కరీంనగర్: కరీంనగర్ నగరంలో నవంబర్ 23న బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ‘మహా పాదయాత్ర’ (Maha Padayatra) కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ మేయర్, ప్రస్తుత నగర డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు (Yadagiri Sunil Rao) పిలుపునిచ్చారు. ఆదివారం ప్రకటన విడుదల చేస్తూ.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ కరీంనగర్ పర్యటన నేపథ్యంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ నాయకత్వంలో ఈ మహా పాదయాత్ర చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నగరంలోని బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజాస్వామ్యవాదులు, సామాన్య ప్రజలందరూ స్వచ్ఛందంగా పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.

విపక్షాల కుట్రలను తిప్పికొట్టాలి

ఎస్ఐఆర్ ప్రక్రియను ఉద్దేశించి బీజేపీపై బురద చల్లాలనే దురుద్దేశంతో కాంగ్రెస్, ఇతర ఇండీ కూటమి పార్టీలు కలిసికట్టుగా కుట్రలు పన్నుతున్నాయని యాదగిరి సునీల్ రావు  విమర్శించారు. ప్రజల్లో అవాస్తవాలను ప్రచారం చేస్తూ, కృత్రిమ ఆందోళనల ద్వారా సమాజంలో గందరగోళం సృష్టించేందుకు విపక్షాలు ప్రయత్నిస్తున్నాయని మండిపడ్డారు. అయితే, విపక్షాలు చేస్తున్న ఈ మోసపూరిత నాటకాలను ప్రజలందరూ నిశితంగా గమనిస్తున్నారని స్పష్టం చేశారు.

కాంగ్రెస్, ఇండీ కూటమి చేస్తున్న అసత్య ఆరోపణలు, కుట్రలను ప్రజలందరికీ పూర్తిస్థాయిలో బహిర్గతం చేసేందుకే ఈ మహా పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించుకునేందుకు ప్రజాస్వామ్యవాదులందరూ ఒక్కటై విపక్షాల కుట్రలను గట్టిగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.

మహా పాదయాత్ర వివరాలు

నవంబర్ 23న సోమవారం మధ్యాహ్నం ఒంటి గంటకు కరీంనగర్‌లోని వైశ్యభవన్ నుంచి ఈ మహా పాదయాత్ర ప్రారంభమై కమాన్ చౌరస్తా వరకు కొనసాగుతుందని వెల్లడించారు. కావున నగర ప్రజలు, బీజేపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>