“వాళ్లంతా దేశ ద్రోహులే”.. బండి సంజయ్​ సంచలన వ్యాఖ్యలు

కలం, వెబ్​ డెస్క్​: సర్ (SIR) ను అడ్డుకునే వాళ్లంతా దేశ ద్రోహులే అని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్​ (Bandi Sanjay) సంచలన వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్​ లో పలు అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. విదేశీ అక్రమ చొరబాటుదారులకు ఓట్లు కావాలని కోరుకునే వాళ్లు సైతం మూర్ఖులేనని మండిపడ్డారు. ఈ దేశ పౌరులకు మాత్రమే ఈ దేశ ప్రధాని, ముఖ్యమంత్రి మొదలు ఎంపీ, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులుగా ఎవరు ఉండాలనేది నిర్ణయించే అధికారం ఉందన్నారు.

కాంగ్రెస్ కు బీజేపీ పోటీయే కాదని, బీఆర్ఎస్ తోనే పోటీ అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపైనా బండి సంజయ్ (Bandi Sanjay)​ స్పందించారు. బీజేపీ అంటే సీఎం రేవంత్ రెడ్డి భయపడుతున్నాడని, బీజేపీని తట్టుకునే దమ్ము కాంగ్రెస్ కు లేదని విమర్శించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి బీజేపీని అడ్డుకోవాలని కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు.

Also Read : తక్కువ నీటితో సిరుల పంట.. ఇదీ ‘అంకాపూర్’ మ్యాజిక్!

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>