కలం, వెబ్ డెస్క్ : ది రాజాసాబ్ కు (The Raja Saab) అనుకోని అదృష్టం కలిసొచ్చింది. ప్రభాస్ హీరోగా మారుతి డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా జనవరి 8న ప్రీమియర్లతో రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే కదా. అయితే 9న తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన జననాయకుడు (Jana Nayakudu) కూడా రిలీజ్ అవుతుండటంతో ప్రభాస్ మూవీకి భారీ పోటీ ఎదురైంది. కలెక్షన్లు తగ్గుతాయనే టాక్ నడిచింది. సౌత్ లో అటు ఓవర్సీస్ లో విజయ్ కు భారీ క్రేజ్ ఉంది. పైగా విజయ్ చివరి మూవీ. కాబట్టి రాజాసాబ్ కు బలమైన పోటీ తప్పదని అంతా అనుకుంటున్న టైమ్ లో జననాయకుడు మూవీకి సెన్సార్ చిక్కులు వచ్చి పడ్డాయి. ఇప్పటికే ఆ మూవీ టీమ్ కోర్టుకు వెళ్లినా.. అక్కడ సత్వర ఊరట దక్కలేదు.
చూస్తుంటే ఆ సినిమా రిలీజ్ 9న కష్టమే అనిపిస్తోంది. దీంతో రాజాసాబ్ (The Raja Saab) కు పోటీ లేకుండా పోయింది. తమిళం, ఓవర్సీస్ లో రాజాసాబ్ దే హవా కనిపిస్తోంది. అటు కర్నాటక, కేరళలో ప్రభాస్ కు ఉన్నంత ఇమేజ్ ఇప్పుడు రిలీజ్ అవుతున్న సినిమాల్లో ఏ హీరోలకు లేదు కాబట్టి కాబట్టి అక్కడ వసూళ్లకు తిరుగులేదు. అటు ఓవర్సీస్ లోనూ ప్రభాస్ దే పైచేయి అయ్యే ఛాన్స్ ఉంది. జననాయకుడు రిలీజ్ కాకపోతే ఆ మూవీకి ఇవ్వాల్సిన థియేటర్లు కూడా రాజాసాబ్ ఖాతాలోనే పడేలా ఉన్నాయి. కాకపోతే సినిమాకు హిట్ టాక్ వస్తేనే అనుకున్నంత కలెక్షన్లు వస్తాయి. హారర్ కామెడీ సినిమాలకు యావరేజ్ గా కలెక్షన్లు వస్తుంటాయి. పైగా ప్రభాస్ కు ఉన్న ఇమేజ్ దృష్ట్యా తొలి రోజు కలెక్షన్లు బాగానే ఉంటాయి. కానీ ఆ తర్వాత కలెక్షన్లు రావాలంటే బొమ్మ హిట్ కావాల్సిందే. లేదంటే ఎన్ని థియేటర్లు దొరికినా లాభం ఉండదు.
Read Also: సంక్రాంతికి సర్ ప్రైజ్ హిట్స్ ఉంటాయా?
Follow Us On: Instagram


