epaper
Friday, January 16, 2026
spot_img
epaper

మిల్కాసింగ్.. 15 ఏళ్లకే ఇండియా నెం.1

కలం, వెబ్​డెస్క్​: కేవలం 15 ఏళ్లకే హర్జాయ్ మిల్కాసింగ్ ​(Harjai Milkha Singh) రికార్డ్ సృష్టించారు. ప్రస్తుతం అండర్ 18 విభాగంలో జాతీయ స్థాయిలో జూనియర్ గోల్ఫ్‌లో నెం.1 ప్లేయర్‌గా నిలిచాడు. చండీగఢ్-దుబాయ్ మధ్య శిక్షణ పొందుతూ ప్రముఖ కోచ్ జెస్సీ గ్రేవాల్ మార్గదర్శకత్వంలో ప్రపంచ నంబర్ వన్ స్కాటీ షెఫ్లర్‌ను ఆదర్శంగా తీసుకుని హర్జాయ్ ఎదిగాడు. అతడు పెరిగిన వాతావరణంలో ప్రతిభ జీవన విధానంగా మారింది. హర్జాయ్ గోల్ఫ్ ప్రయాణం 2016లో ఆరేళ్ల వయసు నుంచే ప్రారంభమైంది. అప్పట్లో క్రికెట్, ఫుట్‌బాల్‌తో పాటు గోల్ఫ్‌ కూడా ఆడేవాడు. తన తండ్రి జీవ్ మిల్కాసింగ్ చండీగఢ్ గోల్ఫ్ కోర్సులో అడుగుపెట్టడాన్ని చూసి, ఆయన మాదిరిగానే గోల్ఫ్ పట్ల ఆసక్తి పెంచుకున్నాడు. ఆ ఆసక్తి క్రమంగా అభిరుచిగా మారింది.

ఏడాదిలో ఎన్నో విజయాలు..

కేవలం ఏడాదిలోనే మిల్కాసింగ్ జూనియర్ ఛాలెంజ్​లో సబ్ జూనియర్ టైటిల్ గెలిచాడు. మలేసియాలో జరిగిన యూఎస్ కిడ్స్ గోల్ఫ్ వరల్డ్ ఛాంపియన్ షిప్‌లో మూడో స్థానం సాధించాడు. అనంతరం 2023లో యూఎస్ కిడ్స్ గోల్ఫ్ యూరోపియన్ ఛాంపియన్ షిప్ అండర్ 13 విభాగంలో విజయం సాధించాడు. ఛానల్ దీవుల్లోని లా మోయే క్లబ్‌లో జరిగిన జెర్సీ లెజెండ్స్ కప్‌లో అమెచ్యూర్ గోల్ఫర్లలో నాలుగో స్థానం దక్కించుకున్నాడు.

ఈ టోర్నీలతో పాటు అమెచ్యూర్‌గా పీజీటీఐ ఇండియన్ గోల్ఫ్ ప్రీమియర్ లీగ్ సర్క్యూట్లలో పాల్గొనడం అతడికి సీనియర్ స్థాయి అనుభవం అందించింది. ఇవన్నీ అతడు కెరీర్​లో వేగంగా ఎదగడానికి దోహదపడ్డాయి. 2025 మిల్కాసింగ్​ను భారత జూనియర్ గోల్ఫ్‌లో ఆధిపత్య శక్తిగా నిలిపింది. స్ట్రాబెర్రీ ఫీల్డ్స్ హై స్కూల్ విద్యార్థి అయిన అతడు కోయంబత్తూరులో జరిగిన ఐజీయూ సదర్న్ ఇండియా జూనియర్స్‌తో సీజన్ ప్రారంభించాడు. పంచకులలో ఐజీయూ నార్తర్న్ ఇండియా అమెచ్యూర్, అహ్మదాబాద్‌లో ఐజీయూ గుజరాత్ జూనియర్స్, కోల్‌కతాలో ఆర్సీజీసీ జూనియర్ ఛాంపియన్ షిప్‌లో విజయం సాధించాడు.

మొత్తం పన్నెండు టోర్నీల్లో పాల్గొని 468 పాయింట్లు సాధించాడు. అత్యుత్తమ ఎనిమిది టోర్నీల నుంచి వచ్చిన 357 పాయింట్లతో ప్రతిష్టాత్మక ఇండియన్ గోల్ఫ్ యూనియన్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ బాయ్స్ టైటిల్‌ కైవసం చేసుకున్నాడు. గత సీజన్ తనకు ఎంతో సంతృప్తినిచ్చిందని హర్జాయ్ చెప్పాడు. ఏడాది పొడవునా స్థిరంగా ఆడగలిగానని తెలిపాడు. నాలుగు విజయాలు, ఒక రన్నరప్, ఒక మూడో స్థానం తన ప్రదర్శనకు నిదర్శనమని పేర్కొన్నాడు. దేశీయ సీజన్‌ను సమర్థంగా నిర్వహించిన ఐజీయూ‌కు కృతజ్ఞతలు తెలిపాడు.

తండ్రి నేర్పిన పాఠాలు..

ఆ విజయవంతమైన ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ అది ఎంతో తృప్తినిచ్చే సంవత్సరం అని మిల్కాసింగ్ చెప్పాడు. ఏడాది మొత్తం స్థిరంగా ఆడానని, నాలుగు సార్లు గెలిచానని, ఒకసారి రెండో స్థానం, ఒకసారి మూడో స్థానం సాధించానని వివరించాడు. టోర్నమెంట్ డైరెక్టర్లు, రిఫరీలు, సిబ్బందికి కూడా కృతజ్ఞతలు తెలిపాడు. ఏడాదికి పన్నెండు టోర్నీలు నిర్వహించడం పెద్ద బాధ్యత అయినా వారు అద్భుతంగా నిర్వహిస్తున్నారని అన్నాడు.

మరో ఏడాది లేదా ఏడాదిన్నర పాటు అమెచ్యూర్‌గా కొనసాగాలని భావిస్తున్నానని మిల్కాసింగ్​ తెలిపాడు. పటిష్టమైన పునాది ఏర్పరుచుకున్న తర్వాతే ప్రొఫెషనల్ స్థాయికి వెళ్లాలని అనుకుంటున్నానని అన్నాడు. రాబోయే సీజన్ లక్ష్యాలపై మాట్లాడుతూ.. ఈ ఏడాది నంబర్ వన్ అమెచ్యూర్‌గా నిలవడమే ప్రధాన లక్ష్యమని తెలిపాడు. ఆర్ అండ్ ఏ బాయ్స్, యూఎస్ జూనియర్ బాయ్స్ వంటి అంతర్జాతీయ ప్రధాన టోర్నీల్లో పాల్గొనాలనే ఆలోచన ఉందని అన్నాడు.

తండ్రి జీవ్ మిల్కాసింగ్ చిన్నప్పటి నుంచే ఓర్పు, వినయం, ప్రతి షాట్‌లో కచ్చితమైన విధానాన్ని పాటించడం నేర్పించారని తెలిపాడు. ఇవే తన పోటీ స్వభావానికి పునాదిగా మారాయని అన్నాడు. తన ఆట గురించి మాట్లాడుతూ అన్ని విభాగాల్లో గణనీయమైన మెరుగుదల వచ్చిందని, ముఖ్యంగా మానసికంగా బలపడ్డానని చెప్పాడు. ఒత్తిడిని చివరి క్షణాల్లో సమర్థంగా ఎదుర్కొనే సామర్థ్యం పెరిగిందని తెలిపాడు. ఈ మానసిక స్థైర్యమే ఇప్పుడు తన ప్రత్యేకతగా మారిందని అన్నాడు.

తన అభివృద్ధికి కోచ్ జెస్సీ గ్రేవాల్‌తో చేసే శిక్షణ కీలకమని చెప్పాడు. వారానికి ఒకటి లేదా రెండు సార్లు శిక్షణ పొందుతానని, ప్రయాణాల్లో ఉన్నప్పుడు కూడా ఆన్‌లైన్ పాఠాలను ఫోన్ కాల్స్, వీడియో కాల్స్ ద్వారా శిక్షణ కొనసాగుతుందని తెలిపాడు. మిల్కాసింగ్ భారత గోల్ఫ్‌కు వారసత్వం, సామర్థ్యం, క్రమశిక్షణ, ఆకాంక్షల సమ్మేళనంగా నిలిచే యువ క్రీడాకారుడు. తండ్రి కోచ్ మార్గదర్శకత్వంతో స్పష్టమైన దృష్టితో తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్న హర్జాయ్​ మిల్కాసింగ్ తో భారత గోల్ఫ్ భవిష్యత్తు భద్రమైన చేతుల్లో ఉన్నట్టే కనిపిస్తోంది.

Harjai Milkha Singh
Harjai Milkha Singh

Read Also: బంగ్లాదేశ్ సమస్యపై ఐసీసీ ఫైనల్ తీర్పు అప్పుడే!

Follow Us On: Pinterest

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>