కలం, ఉట్నూర్: ఉట్నూర్‌లోని చారిత్రక రాజుల కోటలో గిరి ఉత్సవాల నిర్వహణపై ఆదివాసీ తెగల నాయకులు, పెద్దలతో నిర్వహించిన సమావేశంలో ఖానాపూర్ ఎమ్మెల్యే, నిర్మల్ డీసీసీ అధ్యక్షులు వెడ్మ బొజ్జు పటేల్ (MLA Vedma Bhojju Patel) శనివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు ఎంతో గొప్పవని, వాటిని భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు.
ఆదివాసీ తెగలన్నీ ఐక్యంగా గిరి ఉత్సవాల్లో భాగస్వాములై వేడుకలను ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఉత్సవాల్లో ఆదివాసీ కళలు, సంస్కృతి, సంప్రదాయాలకు ప్రత్యేక ప్రాధాన్యత కల్పించాలని సూచించారు. గిరి ఉత్సవాల విజయవంతానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో ఐటీడీఏ పీవో మంద మకరంద్, ఏఎస్పీ రిత్విక్, ఆదివాసీ తెగల నాయకులు, పెద్దలు పాల్గొన్నారు.
Also Read : ఐఐటీ ఖరగ్‌పూర్‌కు గూగుల్ భారీ విరాళం
Follow Us On : WhatsApp

