కలం, వరంగల్: భవన నిర్మాణ నిబంధనలను పక్కాగా పాటించిన వాటికే అనుమతులు, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు జారీ చేస్తామని జీడబ్ల్యూఎంసీ కమిషనర్ వెంకన్న(Venkanna) స్పష్టం చేశారు. శనివారం ఫాతిమా నగర్, డీ-మార్ట్ (కాజీపేట), ఎక్సైజ్ కాలనీ తదితర ప్రాంతాల్లో ఓసీ జారీ కోసం నిర్మించిన భవనాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
నిర్మాణ అనుమతులకు అవసరమైన ధ్రువపత్రాలతో దరఖాస్తు చేసుకోవాలని, మున్సిపల్ చట్ట నిబంధనలకు అనుగుణంగా నిర్మాణాలు చేపట్టాలని సూచించారు. నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడితే చట్టప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ పరిశీలనలో సిటీ ప్లానర్ రవీందర్ రాడేకర్, అసిస్టెంట్ సిటీ ప్లానర్ ప్రశాంత్, టీపీఎస్ అవినాష్ పాల్గొన్నారు.

