రూ.20 వేల కోట్లతో పట్టణాల అభివృద్ధి: సీఎం రేవంత్

కలం, వెబ్ డెస్క్: రాష్ట్రంలో రూ.20 వేల కోట్లతో పట్టణాల్లో వివిధ ప్రాజెక్టులను చేపట్టేందుకు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)  గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వాతావరణ మార్పులను తట్టుకునేలా, పర్యావరణ పరిరక్షణకు దోహదపడేలా పట్టణాల అభివృద్ధి జరగాలని సూచించారు. ఈ మేరకు తన నివాసంలో మున్సిపల్ శాఖపై కీలక సమీక్ష చేశారు. పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధికి పురపాలక శాఖ రూపొందించిన ప్రతిపాదనలపై ఆరా తీశారు. ప్రపంచ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంకుల నుంచి రూ.20 వేల కోట్లను నిధులు సమీకరించేలా పురపాలక శాఖ ప్రణాళికలు రూపొందించింది. ఈ సందర్భంగా వరంగల్ నగర అభివృద్ధిపై ప్రత్యేకంగా చర్చ జరిగింది. నగర భూగర్భ వ్యవస్థ ఆధునీకరించడం, వరంగల్ కోట చుట్టు కందకం పునరుద్ధరణ, హనుమకొండలో సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్ అభివృద్ధిపై చర్చించారు.

తాగునీటి సరఫరాపై..

రాష్ట్రంలో మురుగునీటిని శుద్ధి చేసి వినియోగించే ప్రత్యేక విధానాన్ని రూపొందిస్తున్నట్లు అధికారులు సీఎం రేవంత్ రెడ్డికి వివరించారు. ఇలా శుద్ధి చేసిన నీటిని పరిశ్రమలు, ఇతర పారిశ్రామిక అవసరాలకు వినియోగించాలని ముఖ్యమంత్రి సూచించారు. పట్టణాల్లో తాగునీటి సరఫరా, విద్యుత్ వినియోగం, పునరుత్పాధక ఇంధన వనరుల వినియోగంపై దిశానిర్దేశం చేశారు. ఈ ప్రాజెక్టుల ద్వారా పట్టణాల కర్భన ఉద్గారాల తగ్గించడం, నీటి వనరులను రక్షించడం, వరద ముప్పును నివారించడంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>