జాతీయ కార్మిక సమ్మేళన ప్రతినిధిగా సురేష్

కలం, మహబూబ్ నగర్ బ్యూరో: బెంగళూరులో ఈ నెల 22 నుంచి 26 వరకు ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (AITUC)  అఖిల భారత జాతీయ 43 మహాసభల కార్మిక సమ్మేళనం జరగబోతుంది. దీనికి మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి చెందిన ఏఐటీయూసీ నేత పి.సురేష్ ఎంపికయ్యారు. ఈ జాతీయ కార్మిక సమ్మేళనంలో కార్మిక వర్గం ఎదుర్కొంటున్న సవాళ్లు, కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలు, లేబర్ కోడ్స్ పర్యవసనాలు, ప్రభుత్వ రంగ పరిరక్షణ, చట్టబద్ధ హక్కులు, కనీస వేతనాలు, కేంద్ర – రాష్ట్ర ప్రభుత్వాల నూతన ఆర్థిక విధానాలు-వాటి పర్యవసనాలు, రాజ్యాంగ పరిరక్షణ లాంటి అనేక అంశాలపై సుదీర్ఘంగా చర్చలు జరగనున్నాయి. 29 రాష్ట్రాలతో పాటు, కేంద్ర ప్రాంత ప్రాంతాల కార్మిక వర్గ పోరాటాల ఉద్యమ నేతలు పాల్గొంటారని సురేష్ తెలిపారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>