స్టాలిన్‌ను ఓడించిన నేతకు సీఎం విజయ్ కన్నీటి వీడ్కోలు!

కలం, వెబ్ డెస్క్ : తమిళనాడు సీఎం, టీవీకే అధినేత విజయ్ (CM Vijay) తన పార్టీకి చెందిన సీనియర్ శాసనసభ్యుడు వీఎస్ బాబు (VS Babu) అంత్యక్రియల్లో పాల్గొని కన్నీటి పర్యంతమయ్యారు. శుక్రవారం చెన్నైలోని పెరంబూర్‌లో ఉన్న బాబు నివాసం నుంచి అంతిమయాత్ర ప్రారంభమైన వేళ సీఎం విజయ్ స్వయంగా భుజం పై పాడె మోసి తన సహచర నేతకు ఘన నివాళులర్పించారు. అనంతరం తిరు వి క నగర్ లోని విద్యుత్ శ్మశానవాటిక వరకు అంతిమయాత్ర వాహనం పక్కనే నడుస్తూ వెళ్లారు. అంత్యక్రియలు ముగిసే వరకు అక్కడే ఉండి, తన పార్టీ సీనియర్ నేతకు సీఎం విజయ్ బరువెక్కిన హృదయంతో కన్నీటి వీడ్కోలు పలికారు.

కాగా, 2026 అసెంబ్లీ ఎన్నికల్లో కోలాత్తూర్ నియోజకవర్గం నుంచి డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్‌ (MK Stalin)పై విజయం సాధించి సంచలనం సృష్టించిన 75 ఏళ్ల వీఎస్ బాబు గత గురువారం మధ్యాహ్నం గుండెపోటుకు గురై తుదిశ్వాస విడిచారు. దీంతో గురువారం సాయంత్రమే బాబు నివాసానికి చేరుకున్న ముఖ్యమంత్రి విజయ్ (CM Vijay) ఆయన పార్థివదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించడంతో పాటు కుటుంబ సభ్యులను ఓదార్చారు. అంతేకాదు పార్టీ ఎమ్మెల్యే మరణానికి సంతాపంగా టీవీకే తరఫున రాష్ట్రవ్యాప్తంగా ఏడు రోజుల పాటు సంతాప దినాలను ప్రకటించారు.

Also Read : అజిత్ దోవల్‌కు సమన్లు.. భారత్ షాకింగ్ రిప్లై!

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>