కలం, వెబ్ డెస్క్: సిద్ధిపేట బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి తనపై చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. సిద్ధిపేటలో గెలిచిన వ్యక్తికి మంత్రిని చేస్తానన్న వ్యాఖ్యలపై సంచలన సవాల్ విసిరారు. వారు వీరు ఎవరో కాదని.. దమ్ముంటే స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే తనపై పోటీ చేయాలని అన్నారు. ఈ సవాల్ కు తాను సిద్ధమని.. రేవంత్ రెడ్డి దీనిపై సిద్ధమా అని ప్రశ్నించారు.
తెలంగాణ భవన్ లో శుక్రవారం మెదక్ నుంచి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీలోకి చేరికలు జరిగాయి. బీఆర్ఎస్ నాయకులు సరుపు శ్యామ్, ఆయన అనుచరవర్గం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి గులాబీ గూటికి చేరారు. ఈ మేరకు హరీశ్ రావు (Harish Rao) కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, దాసోజు శ్రవణ్, పార్టీ నేతలతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు.
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాదని ఎద్దేవా చేశారు. అన్ని జిల్లాల నుండి కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని అన్నారు. కొత్త పథకాలను ఇవ్వడం కాదని.. తమ నేత కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు కూడా రేవంత్ రెడ్డి అమలు చేయాలని డిమాండ్ చేశారు.
Also Read : “అధికార అహంకారంతో మాట్లాడొద్దు”.. సీఎం కు రాజగోపాల్ రెడ్డి కౌంటర్
Follow Us On : WhatsApp

