రాజీనామా చేయబోతున్న బీజేపీ ఎమ్మెల్యే?

కలం, వెబ్ డెస్క్: బీజేపీ జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి (MLA Adinarayana Reddy) తన పదవికి రాజీనామా చేయబోతున్నారనే అంశం ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తనకు అత్యంత సన్నిహితుడైన రాకేష్ రెడ్డికి జడ్పీ ఛైర్మన్ పీఠం కోసం పట్టుబడుతున్న ఆది నారాయణ రెడ్డి.. ఆ సీటును టీడీపీకి కేటాయించడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. మాట ఇచ్చి తప్పారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆదినారాయణ రెడ్డి పరోక్షంగా సంకేతాలు ఇవ్వడంతో.. బీజేపీ అధిష్ఠానం అప్రమత్తమైంది. రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ కడపలో ఆదినారాయణ రెడ్డితో భేటీ గంట పాటు ప్రత్యేకంగా మాట్లాడారు. ఎంత నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ఆది నారాయణ రెడ్డి వెనక్కి తగ్గకపోవడంతో చేసేదేమీ లేక మాధవ్ వెనుదిరిగారు. జగన్ వల్లే కాలేదని.. ఆయన్ను ఆపడం మన వల్ల కాదంటూ అక్కడున్న పార్టీ నేతలతో మాధవ్ వ్యాఖ్యానించి వెళ్లిపోయారు.

రేపు నిర్ణయం ప్రకటిస్తా..

అనంతరం ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి (MLA Adinarayana Reddy) మాట్లాడుతూ.. తన నిర్ణయాన్ని మార్చుకునే ప్రసక్తే లేదన్నారు. ఎమ్మెల్యే పదవి తనకు గొప్ప కాదని, తాను తలుచుకుంటే క్షణాల్లో సమీకరణాలను మార్చేయగలనని స్పష్టం చేశారు. జడ్పీ ఛైర్మన్ పదవిపై మాట ఇచ్చి తప్పడం ఏమాత్రం సరికాదని, తన నిర్ణయాన్ని రేపు ప్రకటించబోతున్నట్లు తెలిపారు. కాగా, ఇప్పటికే జమ్మలమడుగు జడ్పీటీసీ సభ్యుడు రాజేష్ రెడ్డి రాజీనామా చేయగా.. ఆయనకు మద్దతుగా ముద్దనూరు జడ్పీటీసీ గోవర్ధన్ రెడ్డి కూడా రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నారు. ఈ నేపథ్యంలో రాజీనామాపై ఆది నారాయణ రెడ్డి వెనక్కి తగ్గుతారా..? లేదా..? అనేది ఏపీలో ఉత్కంఠగా మారింది.

Also Read : రణరంగంగా తాడిపత్రి.. వాహనాలకు నిప్పు, ఫర్నీచర్ ధ్వంసం!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>