సిద్ధిపేటపై కాంగ్రెస్ జెండా ఎగరేస్తే మంత్రి పదవి: సీఎం రేవంత్

కలం, వెబ్ డెస్క్: సిద్ధిపేట బహిరంగ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. సిద్ధిపేట గడ్డపై కాంగ్రెస్ పార్టీ జండా ఎగరేస్తే.. ఇక్కడి నాయకుడికి మంత్రి పదవి ఇచ్చే బాధ్యత తనదని వ్యాఖ్యానించారు. ఈ రోజు నుంచి సిద్దిపేట గడ్డ కాంగ్రెస్ అడ్డా అంటూ పేర్కొన్నారు. కాంగ్రెస్ భారీ ర్యాలీకి వేలాది మంది ఆడబిడ్డలు, కార్యకర్తలు కదం తొక్కారని కొనియాడారు. 2029 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి రెండవసారి ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చి ప్రజాపాలన జండా ఎగరేస్తామని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మాట ఇస్తున్నట్లు తెలిపారు. పేదప్రజలకు సంక్షేమ పథకాలతో రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తామని చెప్పుకొచ్చారు.

సిద్ధిపేటలో మామ, మామపోతే అల్లుడు, అల్లుడిపోతే వాడి బాబు అడ్డొస్తాడంట అంటూ కేసీఆర్, హరీశ్ రావుపై సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. మామాఅల్లుళ్లు 4 దశాబ్దాలుగా సిద్దిపేట(Siddipet)ను పాలిస్తున్నారని మండిపడ్డారు. ‘సిద్దిపేట మీ తాతల గడీనా? మామ పోతే అల్లుడు. అల్లుడు పోతే బావమరిది. వాడుపోతే వీడు, వీడుపోతే వాడు. ఎవడెవడో సిద్దిపేట గడ్డను ఏలడానికి ఇది అనాథల రాజ్యమా?’ అంటూ దుయ్యబట్టారు. రబ్బర్ చెప్పుల హరీశ్ రావు 2004లో వార్డ్ మెంబర్ కూడా కాలేడని.. మాజీ సీఎం వైఎస్ఆర్ భిక్షతో మంత్రి అయ్యారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ దయతో రాజశేఖర్ రెడ్డి ఆయనను మంత్రిని చేశారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. సిద్దిపేట కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసు బూట్లతో తొక్కించి, లాఠీలతో కొట్టించారని ఆరోపించారు.

Also Read : సికింద్రాబాద్‌లో 8 నెల‌ల పాటు ట్రాఫిక్ ఆంక్ష‌లు!

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>