డీసీసీబీ 104వ వార్షికోత్సవంలో రక్తదాన శిబిరం

కలం, నిజామాబాద్ బ్యూరో: ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (Nizamabad DCCB) 104వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో భాగంగా బ్యాంకు ప్రధాన కార్యాలయంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం (Blood Donation Camp) నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని అదనపు కలెక్టర్ రాజా గౌడ్, రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ పి. లక్ష్మీనారాయణ, బ్యాంకు సీఈఓ నాగభూషణం, జనరల్ మేనేజర్ అనుపమ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం బ్యాంకు సీఈఓ నాగభూషణం స్వయంగా రక్తదానం చేసి సిబ్బందికి స్ఫూర్తిగా నిలిచారు. బ్యాంకు ఉన్నతాధికారులు, వివిధ విభాగాల ఉద్యోగులు కూడా ఉత్సాహంగా స్వచ్ఛందంగా రక్తదానం చేశారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాజా గౌడ్, రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ పి. లక్ష్మీనారాయణ, రెడ్ క్రాస్ సిబ్బంది, బ్యాంకు సీఈఓ, జనరల్ మేనేజర్లు, ఇతర అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రక్తదానం ప్రాముఖ్యతను వివరిస్తూ, అత్యవసర సమయాల్లో రక్తం ఎంతోమంది ప్రాణాలను కాపాడుతుందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ స్వచ్ఛంద రక్తదానానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. బ్యాంకు (Nizamabad DCCB) అధికారులు, సిబ్బంది రక్తదానం చేయడం ద్వారా సామాజిక బాధ్యతతో పాటు మానవతా విలువలను చాటుకున్నారు.

Also Read : రోహింగ్యాల హత్యలు.. ఇంటర్నేషనల్ కోర్టు సంచలన తీర్పు

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>