కలం, వెబ్‌డెస్క్: పోక్సో కేసు (POCSO Case)లో ముగ్గురు నిందితులకు ఎల్‌బీనగర్‌లోని ఫాస్ట్‌ట్రాక్ స్పెషల్ కోర్టు జైలు శిక్ష విధించింది. చైతన్యపురి పోలీస్ స్టేషన్‌లో 2023లో నమోదైన కేసులో విచారణ పూర్తి చేసిన కోర్టు నేడు ఈ తీర్పు వెలువరించింది. నిందితులు పొలెపాక అరుణ్ పాల్‌కు ఏడేళ్ల జైలు శిక్షతో పాటు రూ.12,500 జరిమానా విధించింది. మంధా పవన్ కల్యాణ్, కాటుకూరి అన్వేష్‌లకు ఐదేళ్ల చొప్పున జైలు శిక్షతో పాటు రూ.3,000 చొప్పున జరిమానా విధించింది.
అంతేకాకుండా బాధితురాలికి రూ.50 వేల పరిహారం అందించాలని కోర్టు ఆదేశించింది. వేగవంతమైన దర్యాప్తు, ఆధారాల సేకరణ, సాక్షుల విచారణతో నిందితులకు శిక్ష పడేలా చేసినట్లు మల్కాజిగిరి పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో దర్యాప్తు అధికారిగా పని చేసిన ఎస్‌ఐ రవి ప్రస్తుతం హైదరాబాద్ సీఐడీలో విధులు నిర్వహిస్తున్నారు. ఆయనతో పాటు అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్లు సత్యనారాయణ, కృష్ణ ప్రసన్నతో పాటు కోర్టు డ్యూటీ అధికారులు, సమన్ల సిబ్బంది, లైజన్ ఆఫీసర్, బ్రీఫింగ్ ఆఫీసర్, సీసీఆర్‌బీ మానిటరింగ్ బృందం కృషిని మల్కాజిగిరి పోలీసులు అభినందించారు.

