కలం, నిర్మల్: అంగన్వాడీ టీచర్లకు పెండింగ్‌లో ఉన్న బీఎల్ఓ, ఎస్ఐఆర్ సర్వే పారితోషికాన్ని వెంటనే చెల్లించాలని కోరుతూ గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ (Anganwadi Workers) అండ్ హెల్పర్స్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి బీఎల్ఓ విధులకు సంబంధించిన నిధులు విడుదల చేసినప్పటికీ నిర్మల్ జిల్లాలో పలువురు అంగన్వాడీ టీచర్లకు పారితోషికం ఇంకా పెండింగ్‌లో ఉందన్నారు.
నిధులు దుర్వినియోగం కాకుండా నేరుగా అంగన్వాడీ ఉద్యోగుల బ్యాంకు ఖాతాల్లోనే జమ చేయాలని, కనీస వేతనం రూ. 42 వేలు, పీఎఫ్, ఈఎస్‌ఐ, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. గ్రాట్యుటీ అమలు, రెండో పీఆర్సీ వర్తింపు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రకటించిన రెండు డీఏలు అంగన్వాడీ ఉద్యోగులకూ వర్తింపజేయాలని కోరారు. ఎన్ఈపీ-2020, పీఎం శ్రీ పథకాలను రద్దు చేసి అంగన్వాడీ కేంద్రాల్లో ఇంగ్లిష్ మీడియం విద్య అందించాలని, ఎన్నికల హామీలను అమలు చేయాలన్నారు.
ఐదు గంటల పాటు ధర్నా నిర్వహించిన అనంతరం జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రాకు వినతిపత్రం అందజేశారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ బీఎల్ఓ బిల్లులపై సంతకాలు చేసి ట్రెజరీకి పంపించినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి సురేష్, యూనియన్ జిల్లా అధ్యక్షురాలు బి.లలిత, కోశాధికారి శైలజ, జిల్లా ఉపాధ్యక్షులు గంగామణి, రజియా, పద్మ, సదా, కవిత, భాగ్య, రమ్య, సహాయ కార్యదర్శులు సావిత్రి, వాణి, సత్య, సునీత తదితరులు పాల్గొన్నారు.

