మ‌రో ఏడు జిల్లాల‌కు అంగన్‌వాడీ ‘తొలిముద్ద’

క‌లం, వెబ్‌డెస్క్‌: ఇందిరా గాంధీ జయంతి సంద‌ర్భంగా రాష్ట్ర ప్ర‌భుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అంగ‌న్‌వాడీ కేంద్రాల్లో ప్ర‌వేశ‌పెట్టిన‌ బ్రేక్‌ఫాస్ట్ (Anganwadi Breakfast) స్కీమ్ ‘తొలిముద్ద‌’ను మ‌రో ఏడు జిల్లాల‌కు విస్త‌రించింది. అంగ‌న్ వాడీ కేంద్రానికి వ‌చ్చే పిల్ల‌ల‌కు పౌష్టికాహారం అందిచాల‌నే ల‌క్ష్యంతో ఈ ప‌థ‌కాన్ని ప్రారంభించారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ ప‌థ‌కాన్ని ఆదిలాబాద్‌, భ‌ద్రాద్రి కొత్త‌గూడెం, కుమురంభీం అసిఫాబాద్‌, వికారాబాద్‌, ములుగు, నాగ‌ర్‌క‌ర్నూల్‌, మ‌హ‌బూబాబాద్ జిల్లాల్లో కొన‌సాగిస్తున్నారు.

ఇప్పుడు తాజా నిర్ణ‌యంతో భూపాలపల్లి, జనగాం, వనపర్తి, రాజన్న సిరిసిల్ల, హన్మకొండ, పెద్దపల్లి, వరంగల్ జిల్లాల్లో ప‌థ‌కాన్ని నేటి నుంచి అమ‌లు చేస్తున్నారు. కొత్త‌గా 8,694 అంగన్ వాడీ కేంద్రాల్లో ఈ స్కీమ్ అమ‌లు కానుంది ఇక ప్ర‌తి రోజు ప‌థ‌కం అమ‌లుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్త‌య్యాయి. కొత్తగా విస్తరించిన ఈ 7 జిల్లాల ద్వారా మ‌రో 43,657 మంది చిన్నారులకు రోజూ పోషకాహారంతో కూడిన అల్పాహారం అందిస్తారు. రానున్న ఏడాది మార్చి చివ‌రి నాటికి రాష్ట్రంలోని మిగ‌తా 19 జిల్లాల్లో కూడా ఈ ప‌థ‌కాన్ని ప్రారంభించాల‌ని ప్ర‌భుత్వం ల‌క్ష్యంగా పెట్టుకుంది. దీనికి అనుగుణంగా అధికారులు ప్ర‌ణాళిక‌లు రూపొందిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>