నార్సింగి పసిఫికా హిల్‌క్రెస్ట్ అపార్ట్‌మెంట్‌లో అగ్నిప్రమాదం

కలం, వెబ్ డెస్క్: రంగారెడ్డి జిల్లా నార్సింగి (Narsingi) పరిధిలోని పసిఫికా హిల్‌క్రెస్ట్ అపార్ట్‌మెంట్ అగ్నిప్రమాదం (Apartment Fire) సంభవించింది. అపార్ట్‌మెంట్‌లోని ఓ బ్లాక్ వద్ద ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికంగా కలకలం రేగింది. మంటలతో పాటు దట్టమైన పొగ కమ్ముకోవడంతో అపార్ట్‌మెంట్ నివాసితులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

వెంటనే అప్రమత్తమైన వారు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. మంటలను ఇతర ఫ్లాట్లకు వ్యాపించకుండా అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>