ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభంలో పాల్గొన్న మేయర్, మార్కెట్ కమిటీ చైర్మన్

కలం, కరీంనగర్ : రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా సజావుగా విక్రయించుకునేలా అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు కరీంనగర్ ( Karimnagar) మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నరసన్న పటేల్ తెలిపారు. ఈ సందర్భంగా ధాన్యం కొనుగోళ్ల కోసం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను కరీంనగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నరసన్న పటేల్ ముఖ్య అతిథిగా హాజరై కరీంనగర్ నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ తో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. కొనుగోలు కేంద్రాలకు వచ్చే రైతులకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని, ధాన్యం విక్రయించే సమయంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చే ముందు ప్రభుత్వం నిర్దేశించిన నాణ్యతా ప్రమాణాలను పాటించాలని, కొనుగోలు ప్రక్రియలో అధికారులకు సహకరించాలని కోరారు.

రైతులకు మద్దతుగా నిలుస్తూ ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను పారదర్శకంగా, వేగవంతంగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు పురుమల్ల శ్రీనివాస్, రామ్ రెడ్డి మరియు ఏఎంసీ డైరెక్టర్లు మీసాల శంకర్, మలోతుమాలతి, మార్కెట్ కమిటీ సెక్రటరీ హమీద్ అలీ, ప్యాక్స్ చైర్మన్ శ్యాంసుందర్ రెడ్డి, అగ్రికల్చర్ ఏడి రంజిత్ రెడ్డి, సీఈఓ రమేష్ సంబంధిత అధికారులు, నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>