మూడు రీజియన్లుగా తెలంగాణ అభివృద్ధి: సీఎం రేవంత్

కలం, వెబ్ డెస్క్ : నగరంలోని హైటెక్స్ వేదికగా ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్ (Indian Roads Congress) 85వ వార్షిక సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి సదస్సును ప్రారంభించారు. ఈ నెల 22వ తేదీ వరకు కొనసాగనున్న ఈ ప్రతిష్ఠాత్మక సదస్సుకు దేశవ్యాప్తంగా సుమారు 3,500 మంది రహదారి రంగ నిపుణులు, ఇంజినీర్లు, ఉన్నతాధికారులు హాజరవుతున్నారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని సమగ్రాభివృద్ధి దిశగా నడిపించేందుకు తెలంగాణను మూడు రీజియన్లుగా విభజించి డెవలప్ చేస్తున్నామని వెల్లడించారు. మౌలిక సదుపాయాల కల్పన, రహదారుల విస్తరణ ద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టిస్తున్నామని పేర్కొన్నారు.

కేంద్ర ప్రభుత్వం నిర్దేశించుకున్న 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యంలో తెలంగాణ పాత్ర కీలకంగా ఉంటుందని సీఎం ధీమా వ్యక్తం చేశారు. 2034 నాటికి తెలంగాణను ఒక ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, అలాగే 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే తమ ప్రధాన టార్గెట్ అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

Also Read : “రాజగోపాల్ రెడ్డి చెప్పింది నిజమే”.. కాంగ్రెస్​ ఎమ్మెల్యేకు రాజాసింగ్​ మద్దతు

Follow Us On: Youtube

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>